భారతదేశం, మే 25 -- ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం అవతరించింది! ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న జపాన్​ 5వ స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్​ సీఈఓ బీవీఆర్​ సుబ్రమణ్యం ప్రకటించారు. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

"భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మన ముందు అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి," అని సుబ్రమణ్యం అన్నారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) గణాంకాలను ఉటంకిస్తూ.. భారత్ ఇప్పుడు జపాన్​ని అధిగమించిందని నీతి ఆయోగ్ సీఈఓ ధృవీకరించారు. అంతేకాదు 2.5-3 ఏళ్లలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు.

2010లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లిస్ట్​లో భారత్ 10వ స్థానంలో ఉండే...