Telangana, ఏప్రిల్ 25 -- కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన మృతులకు నివాళులర్పిస్తూ హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ చౌరస్తా వరకు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
భారత్ సమ్మిట్ కు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో భాగస్వామ్యం అయ్యారు. ఉగ్రమూకల దాడులను ఖండించారుయ మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.
ఈ ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.