భారతదేశం, ఆగస్టు 1 -- విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మరోసారి విద్యుత్ వినియోగదారులపై భారీ భారం పడనుందని, 'ట్రూ-అప్' చార్జీల పేరుతో రూ.12,771 కోట్ల అదనపు భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేర్కొంది. ఈ అదనపు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు.
విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని చెబుతూనే, మరోవైపు 'ట్రూ-అప్' పేరుతో కొత్త భారాన్ని మోపడం పట్ల సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2019-20 నుంచి 2023-24 వరకు విద్యుత్ రిటైల్ వ్యాపారంలో వచ్చిన లోటును భర్తీ చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కంలు) రూ.12,771 కోట్లు వసూలు చేయాలని విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.