భారతదేశం, జూలై 21 -- జీవితం క్షణాల్లో మారిపోతుందనేందుకు మరొక ఉదాహరణ ఇది! ఒక మహిళ, ఆమె భర్తతో, తన ఇంటి మేడ మీద​ ఒక ఆహ్లాదకర సాయంత్రాన్ని గడుపుతోంది. ఇంతలో.. "నేను జారి పడిపోతే నన్ను పట్టుకుంటావా?" అని అడిగింది. అక్కడి నుంచి కొన్ని క్షణాలకే, ఆ మహిళ టెర్రెస్​ మీద నుంచి జారి కిందపడి ప్రాణాలు కోల్పోయింది.

ఒడశాకు చెందిన బోరింగి పార్వతి, డీ దుర్యోధన్​ రావ్​లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారు గురుగ్రామ్​లోని డీఎల్​ఎఫ్​ ఫేస్​ 3లోని ఒక అపార్ట్​మెంట్​లో నివాసముంటున్నారు.

కాగా గత మంగళవారం వారిద్దరు కలిసి భవనం మేడ మీదకు వెళ్లారు. కొంతసేపు ఆహ్లాదకర సమయం గడిపారు. ఆ తర్వాత ఆ మహిళ, తన భర్తను ఆటపట్టించడం మొదలుపెట్టింది. టెర్రెస్​ ఎక్కి, ప్రమాదకరంగా కూర్చుంది.

"నేను పడిపోతే, నువ్వు నన్ను కాపాడతావా?" అని ఆ మహిళ, తన భర్తను అడిగింది. "కిందకి దిగు" అని...