భారతదేశం, మే 28 -- కన్నడ భాష చుట్టూ ఇటీవలి కాలంలో నెలకొన్న వివాదాలకు ప్రముఖ నటుడు కమల్​ హాసన్​ మరింత ఆజ్యం పోశారు! "కన్నడ భాష పుట్టింది తమిళం నుంచే" అని ఆయన చేసిన కామెంట్స్​పై తీవ్ర దుమారం రేగింది. కర్ణాటక నేతలు కమల్​ హాసన్​ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

కమల్​ హాసన్​ నటించిన థగ్​ లైఫ్​ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్​ కాబోతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్​ జరిగింది. ఈ ఈవెంట్​లో కన్నడ స్టార్​ శివరాజ్​కుమార్​ కూడా పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కమల్​ హాసన్​ మాట్లాడుతూ.. "ఉయిరే ఉరవే తమిళే (నా జీవితం, నా కుటుంబం, నా కుటుంబం తమిళ భాష)" అని అన్నారు. ఆ తర్వాత శివరాజ్​కుమార్​వైపు చూస్తూ.. "ఇది నా కుటుంబం. అందుకే ఈరోజు శివరాజ్​కుమార్​ కూడా వచ్చారు. అందుకే ఈరోజు నా ప్రసంగాన్ని జీవితం, సంబంధాలు, తమిళ్ అంటూ మొదలుపెట్టాను. మ...