భారతదేశం, ఫిబ్రవరి 16 -- అల్లు అర్జున్, స్నేహారెడ్డిల ప్రేమబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్ళై 15 ఏళ్లు గడుస్తున్నా వీరిద్దరి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒక ఆటో వెనుక తన భర్త పేరును చూసి ఆమె మురిసిపోయింది. ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఆ ఫొటోను షేర్ చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన భర్త, పిల్లలకు సంబంధించిన క్యూట్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే తర్వాత హైదరాబాద్ రోడ్లపై వెళ్తుండగా ఆమెకు ఒక ఆటో కనిపించింది. ఆ ఆటో వెనుక "ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాలూకా" అని ఇంగ్లిష్ అక్షరాల్లో రాసి ఉండటాన్ని ఆమె గమనించింది.

వెంటనే ఆ ఆటోను ఫ...