Andhrapradesh,amaravati, మే 2 -- అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. ఐటీ విషయంలో చంద్రబాబు.. తనకంటే ముందు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని గుర్తు చేశారు.
"నేను గుజరాత్ సీఎంగా ఉండగా, నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను. టెక్నాలజీ, ఐటీ విషయంలో నాడు చంద్రబాబు గారు చూపించిన చొరవ నిశితంగా తెలుసుకునే వాడిని. అప్పుడు తెలుసుకున్న విషయాలు ఈ రోజు మీ ముందు చేయగలుగుతున్నాను. అలాంటి అవకాశం నాకు లభించింది" అని ప్రధాని మోదీ చెప్పారు.
"నా అనుభవంతో చెప్తున్నా, ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు చేయలన్నా, వేగంగా చేయలన్నా, క్వాలిటీతో చేయలన్నా చంద్రబాబుని మించి వారు లేరు" అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Publish...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.