భారతదేశం, ఫిబ్రవరి 4 -- ‍Nandigama Murder Plan: ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణ సంఘట‌న చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై రగిలిపోయిన యువతి తండ్రి, వారికి సహకరించిన యువకుడిని హత్య చేసేందుకు ప్లాన్‌ చేసి దొరికిపోయాడు. జిల్లాలోని నందిగామకు చెందిన యువతీయువకులు పెళ్లి చేసుకున్నారు.

ఈ ప్రేమ వివాహం ప్రేమికురాలి తండ్రికి ఇష్టం లేదు. దీంతో వారికి పెళ్లికి స‌హ‌క‌రించిన వ్య‌క్తిని హ‌త‌మార్చేందుకు ప్రేమికురాలి తండ్రి సుపారీ ఇచ్చారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రేమికురాలి తండ్రితో స‌హా మ‌రో ముగ్గురు నిందితులు పోలీసుల‌కు అడ్డంగా దొరికారు. వారిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అనంత‌రం న్యాయ‌మూర్తి ముందు హాజ‌ర‌ప‌రిచారు. దీంతో నిందితుల‌కు న్యాయ‌మూర్తి రిమాండ్ విధించారు.

ఈ ఘ‌ట‌న ఎన్‌టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది....