వరంగల్,మామునూరు, జనవరి 26 -- మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీ ఐరన్ మెటీరియల్ లోడ్ తో వెళ్తున్న లారీ తాడు తెగిపోవడంతో ఘటన జరిగింది. పక్కనే ఉన్న ఆటోలతో పాటు ఓ కారుపై ఐరన్ రాడ్లు పడిపోయాయి.
ఈ ఘోర ప్రమాదంలో ఓ ఆటో పూర్తిగా నజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న మామునూరు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను, పోలీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.