భారతదేశం, జూలై 24 -- ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి రెండేళ్లు దాటింది. బ్రో త‌ర్వాత పాలిటిక్స్‌తో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు దూర‌మ‌య్యారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు మూవీతో అభిమానుల ముందుకొచ్చారు. ఫ‌స్ట్ టైమ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిస్టారిక‌ల్ క‌థ‌తో చేసిన ఈ సినిమాకు క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎమ్ ర‌త్నం ఈ సినిమాను నిర్మించారు. మూడేళ్ల పాటు షూటింగ్‌, నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, ప‌లుమార్లు రిలీజ్ పోస్ట్‌పోన్‌ల‌ను దాటుకొని జూలై 24న (నేడు)ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?

1960 కాలంలో కొల్లూర్ ప్రాంతంలో వీర‌మ‌ల్లు పేరు వింటే హ‌డ‌ల్‌. చోర‌క‌ళ‌లో, వీర‌త్వంలో అత‌డికి మించిన వారు ఉండ‌రు. హైద‌రాబాద్ న‌వాబుల సంప‌ద‌ను దోచే...