భారతదేశం, డిసెంబర్ 15 -- హ్యుందాయ్ వెర్నా తన ఆరవ తరం ఫేస్‌లిఫ్ట్‌తో మార్కెట్‌లోకి వచ్చినప్పుడు, భారతదేశంలో ఫుల్-విడ్త్ ఎల్​ఈడీ లైట్‌బార్ డీఆర్​ఎల్​లు (డేటైమ్ రన్నింగ్ లైట్లు) ఉన్న మొదటి కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం, ఈ మిడ్-సైజ్ సెడాన్‌కు మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. దీని టెస్ట్ మ్యూల్ ఈసారి దక్షిణ కొరియా రోడ్లపై కనిపించింది. రాబోయే 2026 మోడల్ సంవత్సరానికి సంబంధించిన ఈ టెస్ట్​ వెహికిల్​, ముందు- వెనుక భాగాల్లో కప్పి ఉంచడం గమనించవచ్చు. దీనిని బట్టి, ఇందులో పెద్ద మార్పులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన మార్పులు ప్రధానంగా సెడాన్ ముందు- వెనుక భాగంలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ అప్‌డేట్స్‌లో భాగంగా, కొత్త ఫ్రంట్ గ్రిల్, మరింత స్లీక్ డిజైన్‌తో కూడిన బంపర్‌లు ఉండే అవకాశం ఉంది.

కారులో ఉన్న స్ప్లిట్ ...