భారతదేశం, ఏప్రిల్ 16 -- డియో స్కూటర్​ అప్డేటెడ్​ వర్షెన్​ని తాజాగా మార్కెట్​లో లాంచ్​ చేసింది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ 2025 డియో కాస్మెటిక్ మార్పులు, ఓబీడీ 2 కంప్లైంట్ ఇంజిన్, కొత్త ఫీచర్లతో వస్తోంది. 2025 హోండా డియో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ఎక్స్​షోరూం ధరలు రూ.96,749, రూ.1,02,144గా ఉన్నాయి.

2025 హోండా డియో ఇప్పుడు కొత్త 4.2 ఇంచ్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​తో వస్తుంది. ఇది ఇప్పుడు మైలేజ్ ఇండికేటర్​లు, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్, రేంజ్ (ఎంప్టీ డిస్టెన్స్​)ని చూపిస్తుంది. నేవిగేషన్- కాల్ / మెసేజ్ అలర్ట్స్ కోసం హోండా రోడ్ సింక్ యాప్ సపోర్ట్ కూడా ఉంది. దీనితో డ్రైవింగ్​లో ఉన్నా డ్రైవర్లు కనెక్టెడ్​గా ఉండొచ్చు. వీటితో పాటు స్మార్ట్ కీ, మొబైల్ డివైజ్​లను ఛా...