భారతదేశం, ఫిబ్రవరి 19 -- టీ20 ప్రపంచకప్ కు ముందు ఇండియన్ టీమ్ పై భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం అభిషేక్ శర్మ. ఈ ప్రపంచ టీ20 నంబర్ వన్ బ్యాటర్ పొట్టి కప్ లో చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశించారు. ఇండియా కచ్చితంగా 300 స్కోరు అందుకుంటుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అభిషేక్ శర్మ విధ్వంసం పక్కనపెడితే కనీసం ఒక్క రన్ కూడా చేయలేకపోతున్నాడు.

అభిషేక్ శర్మ ఎంతటి డేంజరస్ ప్లేయరో మనకు తెలిసిందే. ఫస్ట్ బాల్ నుంచే అతని ఊతకోత మొదలవుతుంది. అతను ఆడుతుంటే బాల్ గ్రౌండ్ లో కంటే ఎక్కువగా బౌండరీ బయటే ఉంటుంది. కానీ ఏమైందో ఏమో టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ బ్యాట్ సైలెంట్ అయిపోయింది. అతను ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ డకౌట్ అయ్యాడు.

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన తొలి మ్యాచ్ లో అమెరికాను ఢీ కొట్టింది. ఈ పోరులో అభిషేక్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగుతాడని, ఇ...