భారతదేశం, అక్టోబర్ 26 -- హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్.! రేపు (అక్టోబర్ 27) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద 800 మి.మీ డయా ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. ఈ పనుల్లో సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది.
మారేడ్‌పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఎంఎస్ పైప్‌లైన్‌ను స్పోర్ట్స్ గ్రౌండ్, లీ-రాయల్ జంక్షన్, బాలంరాయి వద్ద అనుసంధానం చేస్తారు. కాబట్టి అక్టోబర్ 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 28 ఉదయం 6 గంటల వరకు 18 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి.
ఈ పనుల కారణంగా. నల్లగుట్ట, ప్రకాశ్ నగర్, మేకలమండి, భోలక్‌పూర్, హస్మత్‌పేట తదితర ప్రాంతాలు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది. అంతేకాకుండా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.