భారతదేశం, మే 7 -- హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శేరిలింగంపల్లి మండలం శివారులో 10.18 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను టీసీఎస్ సంస్థ లీజుకు తీసుకుంది. ఈ కార్యాలయానికి నెలకు రూ.4.3 కోట్ల అద్దె చెల్లించనున్నట్లు రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్‌స్టాక్ తెలిపింది.
రాజపుష్పలో ఉన్న ఈ కార్యాలయం 18 అంతస్తుల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలో ఐదు బేస్మెంట్లు, ఒక గ్రౌండ్, 18 ఆఫీస్ ఫ్లోర్లు ఉన్నాయి. 2025 ఏప్రిల్ రిజిస్ట్రేషన్ జరిగిందని, 2024 అక్టోబర్ 1న లీజు ప్రారంభమైందని ఈ సంస్థ పేర్కొంది. రాజపుష్ప అసెట్ మేనేజ్మెంట్ ఎల్ఎల్పీ, పారాడిగ్మ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ భూయజమానులుగా ఉన్నారు.
ఈ ఆఫీస్ స్పేస్ లీజు కాలపరిమితి 15 సంవత్సరాలు, అద్దె ప్రతి సంవత్సరం 12% పెరుగుతాయి. కంపెనీ రూ.26.22 కోట్లు డిపాజిట్ చెల్లించగా, చదరపు అడుగుకు నెలకు రూ.43 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.