భారతదేశం, మే 7 -- హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శేరిలింగంపల్లి మండలం శివారులో 10.18 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను టీసీఎస్ సంస్థ లీజుకు తీసుకుంది. ఈ కార్యాలయానికి నెలకు రూ.4.3 కోట్ల అద్దె చెల్లించనున్నట్లు రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్‌స్టాక్ తెలిపింది.

రాజపుష్పలో ఉన్న ఈ కార్యాలయం 18 అంతస్తుల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలో ఐదు బేస్మెంట్లు, ఒక గ్రౌండ్, 18 ఆఫీస్ ఫ్లోర్లు ఉన్నాయి. 2025 ఏప్రిల్ రిజిస్ట్రేషన్ జరిగిందని, 2024 అక్టోబర్ 1న లీజు ప్రారంభమైందని ఈ సంస్థ పేర్కొంది. రాజపుష్ప అసెట్ మేనేజ్మెంట్ ఎల్ఎల్పీ, పారాడిగ్మ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ భూయజమానులుగా ఉన్నారు.

ఈ ఆఫీస్ స్పేస్ లీజు కాలపరిమితి 15 సంవత్సరాలు, అద్దె ప్రతి సంవత్సరం 12% పెరుగుతాయి. కంపెనీ రూ.26.22 కోట్లు డిపాజిట్ చెల్లించగా, చదరపు అడుగుకు నెలకు రూ.43 ...