భారతదేశం, మే 24 -- హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ సహా పలుచోట్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. బషీర్ బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్ లో భారీ వర్షం కురిసింది.
భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 గంటలపాటు నగరాన్ని ఈ కుండపోత వర్షం కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, మ్యాన్ హోల్స్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని సూచించారు.
నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.