Hyderabad,telangana, ఏప్రిల్ 18 -- హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ.. సాయంత్రం కల్లా పూర్తిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో పలుచోట్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సచివాలయం, నాంపల్లి, ఫిలింనగర్, గచ్చిబౌలి, చిక్కడపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొత్తపేట, హయత్ నగర్, ఉప్పల్ తో మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇవాళ కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.