భారతదేశం, మే 20 -- హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం...టికెట్ల రేట్ల పెంపుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
తగ్గిన మెట్రో ఛార్జీలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇటీవల కనీస ఛార్జీలను రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు మెట్రో రైల్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
మెట్రో ప్రయాణికులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నామని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోలో ప్రయాణిస్తున్న అల్పాదాయ ప్రజలపై భారం పడకూడదని పెంచిన ఛార్జీలపై 10శాతం తగ్గించినట్లు చెప్పారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.