Telangana,tirumala, జూలై 27 -- వచ్చే ఆగస్డ్ నెలలో తిరుమల టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఐఆర్సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకునేందుకు ఈ ప్యాకేజీని ప్రకటించింది.

"TIRUPATI BY VENKATADRI EXPRESS" పేరుతో ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్. నాలుగు రోజులు ఉంటుంది. ముందుస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

ప్రస్తుతం ఈ ట్రిప్ 2 ఆగస్ట్ 2025 వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ట్రైన్(రైలు నెంబర్ 12797) బయల్దేరుతుంది. రాత్రంతా జ...