భారతదేశం, మే 12 -- హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో.. భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అటు సాధారణ ప్రజలు కూడా ఇండ్లు కట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తక్కువ ధరకే త్వరగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరికీ అందుబాటులో ఉండేలా టీజీఎండీసీ చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం ఇసుకకు డిమాండ్ బాగా ఉంది. దీంతో కొందరు వ్యాపారులు, దళారులు టన్నుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీజీఎండీసీ ఇసుక బజార్​లను ఏర్పాటు చేసింది. బడా రియల్టర్ల నుంచి సామాన్య ప్రజల వరకు ఇసుకను తక్కువ ధరకు అందించేందుకు ఇసుక బజార్లను అందుబాటులోకి తెచ్చింది. ఇసుక కావాలనుకునేవారు ఫోన్​ చేస్తే.. 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని టీజీఎండీసీ అధికారులు చెబుతున్నారు.

15 ర...