Telangana,hyderabad, జూలై 19 -- హైదరాబాద్‌ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా వాతావరణం మారిపోగా. భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, టోలిచౌకి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్‌, హయత్ నగర్, నాగోల్‌, ఉప్పల్‌, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్‌ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వాన కురుస్తోంది. అంతేకాకుండా నగర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

భారీ వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెహదీపట్నం రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావటంతో. నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. జూబ్లీహిల్స్‌ అపోలో రోడ్డులోనూ ఇదే పరిస్థితి ఉంది.

రాత్రి కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల...