భారతదేశం, నవంబర్ 19 -- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసే ముఖ్యమైన సంస్థ కాగ్. ఇప్పుడు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) అధునాతన నైపుణ్యాలు, అధిక-నాణ్యత గల ఆర్థిక ఆడిట్ పద్ధతులను పెంపొందించడానికి హైదరాబాద్‌లో ఒక ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆర్థిక ఆడిటింగ్‌లో ఆవిష్కరణ, పరిశోధన, వృత్తిపరమైన అభివృద్ధిలో ఈ సెంటర్ ముందంజలో ఉండాలని భావిస్తున్నట్లు డిప్యూటీ CAG (కమర్షియల్ & రిపోర్ట్ సెంట్రల్) ఏఎం బజాజ్ తెలిపారు.

ఈ కేంద్రం ప్రపంచవ్యాప్త ఉత్తమ పద్ధతులకు ఇంక్యుబేటర్‌గా పనిచేస్తుందన్నారు బజాజ్. అధునాతన నైపుణ్యాలను పెంపొందిస్తుందని, ఈ బ్రాంచ్ అంతటా అధిక-నాణ్యత ఆర్థిక ఆడిట్ పద్ధతుల పాటిస్తుందని ఆయన అన్నారు. 'ఒక బెస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను క్రియేట్ చేయడం ద్వారా కాగ్ సంస్థ అత్యున్నత ఆడిట్ సంస్థగా మరింత బలోపేతం ...