భారతదేశం, నవంబర్ 2 -- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. చాలా మంది ఆఫీసుల నుంచి తిరిగివచ్చే సమయం కావడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

జోడిమెట్ల, నారపల్లి, ఉప్పల్‌, పంజాగుట్ట, జూబ్లిహిల్స్, ఫిలింనగర్, యూసఫ్ గూడ, బోరబండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, ముషిరాబాద్, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, కుత్బూల్లాపుర్, బహదూర్‌పల్లి, జీడిమెట్ల, లింగంపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాబోయే కొన్ని గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అ...