Hyderabad, మే 1 -- అమరన్.. గతేడాది దీపావళికి రిలీజై సంచలన విజయం సాధించిన తమిళ మూవీ. తెలుగులోనూ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలోని హే రంగులే అనే పాట కూడా అంతే ఆదరణ సంపాదించింది. యూట్యూబ్ లో పది కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడానికి దగ్గరవుతున్న ఈ పాట లిరిక్స్ ఇక్కడ మీకోసం ఇస్తున్నాం.

అమరన్ మూవీలోని హే రంగులే లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికే సుమారు పది కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 7న ఈ పాట రిలీజైంది. అప్పటి నుంచీ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూనే ఉంది. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశాడు. ఇక అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు.

శివకార్తికేయన్, సాయి పల్లవిపై రూపొందించిన సూపర్ హిట్ రొమాంటిక్ మెలోడీ ఇది. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట...