భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఈ మధ్య రిలేషన్ షిప్ కామెంట్లతో మృణాల్ ఠాకూర్ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె తన మాజీ లవర్ గురించి చెప్పింది. హ్యాండ్సమ్ హీరోలతో తాను సినిమాలు చేస్తుంటే.. అసూయ, అభద్రతాభావంతో తన బాయ్ ఫ్రెండ్ బరువు పెరిగాడని వెల్లడించింది. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన 'దో దీవానే సెహర్ మే' ప్రమోషన్ లో భాగంగా మృణాల్ ఈ కామెంట్లు చేసింది.

దో దీవానే సెహర్ మే మూవీ ప్రమోషన్లలో భాగంగా 'రిలేషన్ షిట్ అడ్వైజ్' అనే షోలో మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది పాల్గొన్నారు. ఈ క్రమంలో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ లాంటి హ్యాండ్సమ్ హీరోలతో సినిమాలు చేస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ అసూయ, అభద్రతా భావంతో బరువు తగ్గాడని మృణాల్ పేర్కొంది.

''నా కెరీర్ స్టార్టింగ్ లో నేను హృతిక్ రోషన్, ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో సినిమాలు చేశా. అప్పుడు నా బాయ...