భారతదేశం, జూన్ 27 -- మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫీనిక్స్ పేరుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. ఫినిక్స్ మూవీ జూలై 4 తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది.

ఫీనిక్స్ మూవీకి స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే అన‌ల్ అరుసు డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. జ‌వాన్‌, మ‌హేష్‌బాబు శ్రీమంతుడు, ఎన్జీఆర్ జై ల‌వ‌కుశ‌, జ‌న‌తా గ్యారేజ్‌తో పాటు ప‌లు ద‌క్షిణాది, బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీస్‌కు ఫైట్ మాస్ట‌ర్‌గా అన‌ల్ అరుసు ప‌నిచేశాడు. ప్ర‌స్తుతం వార్ 2 మూవీకి యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. యాక్షన్‌, ఎమోష‌న్స్ క‌ల‌బోత‌గా ఫీనిక్స్ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. సూర్య సేతుప‌తికి స‌రైన డెబ్యూ...