భారతదేశం, మే 24 -- కోలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కేజేఆర్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. గుర్తింపు పేరుతో ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేస్తోన్నాడు. స్పోర్ట్స్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి తెన్‌పతియాన్ దర్శకత్వం వ‌హిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఏక‌కాలంలో రూపొందుతోన్న గుర్తింపు మూవీ టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో స్పోర్ట్స్ జెర్సీ ధ‌రించి కోర్ట్‌లో హీరో కేజేఆర్ ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తోన్నాడు. యథార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని మ‌హేశ్వ‌ర్ రెడ్డి మూలి ప్రొడ్యూస్ చేస్తోన్నారు.

టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ- " పేదరికంలో మ‌గ్గే ఓ క్రీడాకారుడు.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు సాగించే ప్ర‌యాణం నేప‌థ్యంలో గుర్తింపు మూవీ సాగుతుంది. ఆటుపోట్ల‌ను దాటుకుంటూ క్రీడాకారుడిగా ఎదిగిన తీరు, గుర్తి...