భారతదేశం, ఫిబ్రవరి 12 -- టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. తమ ఓపెనింగ్ మ్యాచ్ లో అమెరికాపై విజయంతో టోర్నీని స్టార్ట్ చేసిన భారత్.. రెండో మ్యాచ్ లో ఈ రోజు నమీబియాతో తలపడనుంది. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడం గుడ్ న్యూస్.

డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరో పోరుకు సై అంటోంది. టీ20 ప్రపంచకప్ లో గురువారం నమీబియాను ఢీ కొడుతోంది. తొలి మ్యాచ్ లో యుఎస్ఏపై విక్టరీతో సూర్యకుమార్ సేన జోష్ లో ఉంది. నమీబియాను చిత్తు చేయాలనే టార్గెట్ పెట్టుకుంది.

టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-ఎ లో ఈ రోజు ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ ఉంది. ఈ పోరు రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ఈ మ్యాచ్ ను లైవ్ చూడొచ్చు. ఓటీటీలో అయితే జియోహాట్ స్టార్ లో మ్యాచ్ ను వీ...