భారతదేశం, ఫిబ్రవరి 23 -- బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియా భట్ అంతర్జాతీయ వేదికలపై తన ముద్రను వేయడం కొనసాగిస్తోంది. తాజాగా లండన్‌లో జరిగిన 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA 2026) వేదికపై ఆమె అవార్డ్ ప్రజెంటర్‌గా మెరిశారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డును అందించే ముందు అలియా తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించి భారతీయ అభిమానుల మనసు గెలుచుకున్నారు.

అలియా భట్ హిందీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ అలియా భట్‌పై ప్రశంసలు కురిపించారు.

ఒక వైట్ హార్ట్ ఎమోజీని జోడించి అలియాను ట్యాగ్ చేశారు. ఇలా హాలీవుడ్ వేదిక అయిన బఫ్తా అవార్డ్ వేడుకల్లో అలియా భట్ హిందీ స్పీచ్‌ను సమంత పొగడటం వైరల్‌గా మారింది.

నిజానికి అలియాను సమంత సమర్థించడం ఇ...