భారతదేశం, నవంబర్ 28 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ఈ వారంతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వీక్ పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం హౌజ్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం 8 మంది నామినేట్ కాగా వారిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వారం లాగే ప్రతివారం సీరియల్ బ్యూటీ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి టాప్ 1 స్థానంతో బిగ్ బాస్ ఓటింగ్‌లో దూసుకుపోతోంది. బిగ్ బాస్ ఓటింగ్‌లోనే కాదు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ టైటిల్ విన్నర్ రేస్‌లో కూడా తనూజ ముందంజలో ఉందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

బిగ్ బాస్ 9 తెలుగులో సీరియల్ హీరోయిన్‌గా అడుగుపెట్టిన తనూజ గౌడ తన గేమ్‌తో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక క్రమంలో బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటూ, తనూజకే బీబీ టీమ్ ఫేవర్ చేస్తుందంటూ ఫేక్ రూమర్స్ తెగ ప్ర...