భారతదేశం, జూలై 2 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం సమీపించేసింది. రేపే (జూలై 3) హరి హర వీరమల్లు ట్రైలర్ రానుంది. ఈ తరుణంలో ఈ ట్రైలర్ ఎంత నిడివి (రన్‍టైమ్) ఉండనుందో మూవీ టీమ్ నేడు వెల్లడించింది.

హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్ రన్‍టైమ్ 3 నిమిషాల 1 సెకను ఉండనుంది.ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూలై 2) అధికారికంగా వెల్లడించింది. ట్రైలర్ సెన్సార్ పూర్తయిందంటూ ఈ విషయాన్ని ప్రకటించింది మెగా సూర్య ప్రొడక్షన్స్. 3.01 నిమిషాల పాటు ట్రైలర్ నిడివి ఉంటుందంటూ ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

హరి హర వీరమల్లు ట్రైలర్ రేపు (జూలై 3) ఉదయం 11 గ...