భారతదేశం, డిసెంబర్ 5 -- రీసెంట్ తెలుగు సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'జటాధర' ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి చప్పుడు లేకుండా సైలెంట్ గా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. ఇందులో సుధీర్ బాబు హీరో. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇందులో పిశాచిగా నటించింది. థియేటర్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.

సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ జటాధర ఓటీటీలో అడుగుపెట్టింది. ధన పిశాచి నేపథ్యం చుట్టూ సాగే ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 5) సడెన్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులో ఉంది.

జటాధర సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు ఇదే తొలి తెలుగు మూవీ. పైగా హారర్ థ్రిల్లర్ కథాంశం కావడంతో...