భారతదేశం, ఫిబ్రవరి 18 -- బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతని తండ్రి సునీల్ మల్హోత్ర ఢిల్లీలో అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్ధార్థ్ తన తండ్రిని కోల్పోయిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరి 14న సిద్ధార్థ్ తండ్రి సునీల్ మల్హోత్రా చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముంబయి నుంచి సిద్ధార్థ్ మల్హోత్ర, అతని భార్య కియారా అద్వానీ ఢిల్లీ వెళ్లారు. అనారోగ్యంతో సునీల్ కన్నుమూశారు. అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. సిద్ధార్థ్ ఈ కష్ట కాలంలో కుటుంబంతో కలిసి ఢిల్లీలోనే ఉన్నాడు.

సిద్ధార్థ్ తన తండ్రిని తలుచుకుంటూ బరువెక్కిన హృద‌యంతో ఇన్‌స్టాగ్ర...