భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఘోర ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఈ ఘటనలో చనిపోయారు. ఒకే వ్యక్తి మాత్రమే బతికాడు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రివర్గం సంతాపం తెలిపింది.

మృతుల కుటంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతోపాటుగా మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపనుంది. చనిపోయినవారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం.. సౌదీలోనే అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. బాధితు కుటుంబాలకు చెందిన ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పును సౌదీకి తీసుకెళ్లాలని నిర్ణయించింది మంత్రివర్గం.

ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మరణించారు. విద్యానగర్‌...