భారతదేశం, డిసెంబర్ 29 -- ఈ ఏడాది నంబర్ 1 సినిమాగా నిలిచిన 'ధురంధర్' (Dhurandhar) ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని, ఇక మార్చి 2026లో రాబోయే 'ధురంధర్ 2' ప్రేక్షకులను వణికిస్తుందని వర్మ హైప్ పెంచేశాడు.

డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన 'ధురంధర్' సినిమాపై ఆర్జీవీ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమాను ఇండియన్ సినిమాకు ఒక పెద్ద మలుపుగా అభివర్ణించిన వర్మ.. ఇప్పుడు పార్ట్-2 గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది.

సోమవారం (డిసెంబర్ 29) ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఆర్జీవీ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ...