భారతదేశం, నవంబర్ 18 -- మలయాళం సినిమాలను మెచ్చే తెలుగు అభిమానులకు కొదవ లేదు. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత అక్కడి కంటెంట్ పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ ఏడాది కూడా జనవరి నుంచి ఇప్పటి వరకూ సోనీ లివ్ ఓటీటీలో ఆ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో టాప్ 5 సినిమాలు ఏవో సదరు ఓటీటీ.. ఓటీటీప్లేతో షేర్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

నటుడు జోజు జార్జ్ దర్శకుడిగా పరిచయమైన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ త్రిస్సూర్‌లో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు యువకుల కథ. కొన్ని సంఘటనల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరిన లోకల్ గూండా నాయకుడు గిరి (జోజు జార్జ్) పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలోని రా అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్లైమ్యాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అన...