భారతదేశం, జనవరి 19 -- బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల రియాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'జాయ్ అవార్డ్స్ 2026' కార్యక్రమానికి వెళ్లాడు. ఈ ఈవెంట్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందులో ఓ అభిమానితో కింగ్ ఖాన్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో.. షారుక్ ఖాన్ వేదికపై ఉండగా అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ తీసి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. వెంటనే షారుక్ నవ్వుతూ ఆ వ్యక్తి చేతిలోని ఫోన్‌ను సున్నితంగా పక్కకు తీసి, ఎదురుగా ఉన్న ప్రొఫెషనల్ కెమెరామెన్ వైపు చూడమని సైగ చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ట్రోఫీ అందించి, అధికారిక ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ ఫోటోలకు పోజులిచ్చాడు. మరో వ్యక్తి కూడా సెల్ఫీకి ప్రయత్నించగా, షారుక్ అతన్ని కూడా కెమెరా వైపు చూడమని సూచించాడు....