భారతదేశం, జనవరి 19 -- బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల రియాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'జాయ్ అవార్డ్స్ 2026' కార్యక్రమానికి వెళ్లాడు. ఈ ఈవెంట్లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందులో ఓ అభిమానితో కింగ్ ఖాన్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో.. షారుక్ ఖాన్ వేదికపై ఉండగా అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ తీసి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. వెంటనే షారుక్ నవ్వుతూ ఆ వ్యక్తి చేతిలోని ఫోన్‌ను సున్నితంగా పక్కకు తీసి, ఎదురుగా ఉన్న ప్రొఫెషనల్ కెమెరామెన్ వైపు చూడమని సైగ చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ట్రోఫీ అందించి, అధికారిక ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ ఫోటోలకు పోజులిచ్చాడు. మరో వ్యక్తి కూడా సెల్ఫీకి ప్రయత్నించగా, షారుక్ అతన్ని కూడా కెమెరా వైపు చూడమని సూచించాడు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.