భారతదేశం, డిసెంబర్ 15 -- బిగ్ బాస్ శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ దండోరా. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని నిర్మించారు.

సమాజంలోని సామాజిక అసమానతలపై తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇటీవల దండోరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన దండోరా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మీడియా క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించగా డైరెక్టర్ మురళీకాంత్ సమాధానాలు ఇచ్చారు.

ద‌ర్శ‌కుడు ముర‌ళీకాంత్: కాంట్రవర్సీ ఏం కాదండి. ఎందుకంటే సినిమా కంటూ కొన్ని హ‌ద్దులుంటాయి. వాటికి లోబ‌డే మ‌నం ఏం చెప్పాల‌నుకున్నామో దాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాను. స‌మాజంలో దీని వ‌ల్ల మార్పు వ‌స్తుంద‌నేంత గొప్ప మాట‌లు చ...