భారతదేశం, మే 13 -- తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రం చాలా అంచనాలతో వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు కావటంతో మరింత హైప్ ఏర్పడింది. ఈ రొమాంటిక్ యాక్ష్ మూవీ మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. అయితే, ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లలో జోరు చూపించింది. ఈ రెట్రో సినిమా ఓటీటీ రిలీజ్‍పై తాజాగా బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ డేట్‍పై రూమర్లు బయటికి వచ్చేశాయి.

రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. జూన్ 5వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రెట్రో స్ట్రీమింగ్‍కు వస్తుందని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రెట్రో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోస...