భారతదేశం, ఏప్రిల్ 25 -- ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన మూవీ సూర్యాపేట్‌ జంక్షన్‌. రాజేష్ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ హీరోగా న‌టించాడు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

అర్జున్‌ (ఈశ్వర్) ఓ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌. తన నలుగురు స్నేహితులతో కలిసి ఎలాంటి బ‌రువుబాధ్య‌త‌లు లేకుండా జాలాయిగా తిరుగుతుంటాడు. దాబా న‌డిపే జ్యోతి (నైనా సర్వర్)తో అర్జున్‌ ప్రేమలో పడతాడు. నరసింహా (అభిమన్యు సింగ్) ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్‌. ఎమ్మెల్యే కావాలని క‌ల‌లు కంటుంటాడు, పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ కుట్రను ప‌న్నుతాడు.

అదే టైమ్‌లో అర్జున్ స్నేహితుడైన‌ శీను హత్యకు గురవుతాడు. శీనును ఎవరు చంపారు? ఈ మ‌ర్డ‌ర్ వెన‌కున్న మిస్ట‌రీని అర్జున్ ఎలా ఛేదించాడు? శీను హ‌త్య‌కు న‌ర‌సింహాకు ఉన్న సంబంధ‌మేమిట...