Hyderabad, ఆగస్టు 22 -- ఓటీటీలో ఇప్పటి వరకూ వచ్చిన మంచి లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి ది ట్రయల్ (The Trail). ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ రానుంది. ఈ నెల 6వ తేదీన 'ది ట్రయల్: ప్యార్ కానూన్ ధోఖా' సీజన్ 2ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో సీనియర్ నటి కాజోల్ లాయర్ నయానికా సేన్‌గుప్తా పాత్రలో తిరిగి వచ్చింది. ఇక తాజాగా శుక్రవారం (ఆగస్టు 22) ఈ రెండో సీజన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక సెప్టెంబర్ 19 నుంచి ఈ కొత్త సీజన్ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ట్రయల్: ప్యార్ కానూన్ ధోఖా' సీజన్ 2 ట్రైలర్ లాయర్ నయానిక తన కేసులను పరిష్కరిస్తున్నప్పుడు వ్యక్తిగత జీవితంలోని ఒడిదొడుకులను కూడా చూపిస్తుంది. ఆమె భర్త రాజీవ్ (జిషు సేన్‌గుప్తా)తో ఆమెకు తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ట్రైలర్ చివరిలో నయానిక "నాకు విడాకులు కావ...