భారతదేశం, నవంబర్ 27 -- రాచకొండ పోలీసులు కమిషనరేట్‌లోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో హిస్టరీ-షీటర్లను(ఒకప్పుడు రౌడీ షీటర్లు) చేర్చే ఒక వినూత్నమైన సంస్కరణ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం నేరాలు వదిలి జనంలో ఉంటున్న వారిని సమాజ సేవలో పాల్గొనడానికి, వారిని చూసి ఎవరూ భయపడకుండా ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. స్థిరమైన సానుకూల ప్రవర్తన, మార్పు, సంస్కరణలను అంగీకరించడానికి సుముఖత చూపిన హిస్టరీ-షీటర్లను గుర్తించి రద్దీగా ఉండే ట్రాఫిక్ పాయింట్ల వద్ద నియమించారు.

ఉప్పల్, ఎల్బీ నగర్, ECIL వంటి ప్రధాన జంక్షన్లలో హిస్టరీ షీటర్లు, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి పనిచేశారు. వాహనాల కదలికను నిర్వహించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడ్డారు. ఈ కార్యక్రమంపై కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమం అర్థవంతమైన మార్పును సృష్టించడం, ఒక...