భారతదేశం, సెప్టెంబర్ 12 -- బాణసంచాపై దేశ రాజధాని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లలో ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధం కేవలం ఢిల్లీకే ఎందుకు వర్తిస్తుందని కోర్టు ప్రశ్నించింది. దేశ పౌరులందరికీ కాలుష్య రహిత వాతావరణం పొందే హక్కు ఉందని, ఒకవేళ నిషేధం విధించాలనుకుంటే అది దేశమంతటా ఒకే విధానంలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ పరిశీలనలన్నీ బాణాసంచా వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా వెలువడ్డాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో బాణాసంచా అమ్మకాలు, తయారీపై ఏడాదంతా కొనసాగుతున్న నిషేధాన్ని సవాలు చేస్తూ బాణసంచా తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పిటిషన్లపై స్పందించిన ధర్మాసనం, "ఎన్‌సీఆర్‌ల...