Hyderabad, సెప్టెంబర్ 20 -- మంచు కుటుంబం నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ హీరోయిన్‌గా, విలన్‌గా అలరించింది. మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నిలిస్ట్ మంచు లక్ష్మిని అడిగిన ప్రశ్నలు వివాదం అయిన విషయం తెలిసిందే.

ఆ ఇంటర్వ్యూలో అప్పుడే ఆ సీనియర్ జర్నలిస్ట్‌కు మంచు లక్ష్మి నైస్‌గా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. అయితే, తాజాగా సదరు జర్నలిస్ట్‌పై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో మంచు లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

"భారతదేశం స్త్రీలను శక్తిగా ఆరాధించే దేశం. అయితే ప్రొఫెషనల్‌గా కొన్ని స్థలాలకు వెళ్లినప్పుడు మాత్రం స్త్రీలపై ద్వేషం, వారిని అవమానించడం, అగౌరవంగా మాట్లాడటం వంట...