భారతదేశం, జూన్ 23 -- వైద్య ఖర్చులు, ట్రావెల్​, గృహ మరమ్మత్తు, కుటుంబ అవసరాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. లోన్​ పొందడం ఒకెత్తు, అసలు పర్సనల్​ లోన్​కి అర్హత సాధించడం ఇంకొకెత్తు. మరీ ముఖ్యంగా సీనియర్​ సిటిజన్లకు పర్సనల్​ లోన్​ విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. అసలు వారికి లోన్​ తీసుకునే అర్హత ఉంటుందా? ఒకవేళ ఉంటే.. రూల్స్​ ఎలా ఉంటాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ప్రశ్న సమాధనం అవును! పెన్షనర్లు, సీనియర్​ సిటిజన్​లకు పర్సనల్​ లోన్​లు అందించే బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు చాలా ఉన్నాయి. అర్హత ప్రమాణాలు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ, రుణదాతలు సాధారణంగా తమ కస్టమర్లను ఈ కింది ప్రమాణాలపై అంచనా వేస్తారు:

వయస్సు: సాధారణంగా, ఇది 60 నుంచి 75 సంవత్సరాల మధ్య ఉంటుంది.

ఆదాయం: సాధారణంగా, క్రమం తప్పకుండా వచ్చే అద్దె ఆదాయం లేదా పెన...