భారతదేశం, మే 26 -- సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ప్రొటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఈ ఘర్షణలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగారు. ఇరు వర్గాలు దాడికి యత్నించగా...పోలీసులు లాఠీఛార్జి చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను చెదరగొట్టారు. ఇరువర్గాల తోపులాటతో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ వేలికి గాయం అయింది.
పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీ ఛార్జ్ లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలయాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.