భారతదేశం, ఫిబ్రవరి 7 -- ఇప్పటివరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా 9 హిట్లు కొట్టాడు. రీసెంట్ గా మన శంకర వర ప్రసాద్ గారుతో ఈ 2026 సంక్రాంతికి మరో సూపర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ జర్నీ చేస్తున్న అనిల్ రావిపూడి హీరోగానూ చేయాలనే కామెంట్లు ఎప్పటినుంచో వస్తున్నాయి. తాజాగా అనిల్ హీరోగా చేసే సినిమా కోసం అలీ ఓ అమెరికా డాలర్ నోటు అడ్వాన్స్ గా ఇచ్చాడు.

డైరెక్టర్ గా ఎదురులేని అనిల్ రావిపూడి హీరోగానూ యాక్ట్ చేయాలనే అభిప్రాయాలు ఎప్పటి నుంచి వినిపిస్తున్నాయి. కానీ డైరెక్షన్ పైనే పూర్తి కాన్సట్రేషన్ పెట్టిన అనిల్.. హీరో అనే బరువు ఎత్తుకోవడానికి రెడీగా లేడు. కానీ ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అనిల్ ను లాక్ చేశారు.

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ట్...