భారతదేశం, ఫిబ్రవరి 20 -- దేశంలోని వివిధ నగరాలన వేగంగా కనెక్ట్ చేసేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. వీటితో చాలా వేగంగా ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లొచ్చు. దీంతో చాలా మంది ఈ రైలును ఎంచుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రైలుకు మంచి డిమాండ్ ఉంది. చాలా ఈ రూట్‌లో ప్రయాణిస్తుంటారు. అయితే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది.

ఈ అప్డేట్ చేసిన షెడ్యూల్ రైలు నంబర్ 20707 కు వర్తిస్తుంది. ఇది తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను రద్దీగా ఉండే 699-కి.మీ రూట్‌ను కలుపుతోంది. విశాఖపట్నం జంక్షన్‌లో రద్దీని తగ్గించడానికి 2026 ఫిబ్రవరి 20 నుండి సవరించిన మార్పు అమల్లోకి వస్తుంది. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాక సమయాలను సవరించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నిర్ణయిం...